
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(కార్తీక Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -803 లో....జ్యోత్స్న మూడు రోజులుగా కనిపించకపోవడం, ఫోన్ కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. సూరజ్, మాలిని ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా దక్షిణామూర్తి వస్తాడు. జ్యోత్స్న ఆ రోజు ఆఫీసులో జాయిన్ అవుతుందని తను కూడా వస్తానని చెప్తాడు .. దీంతో టెన్షన్ పడిన మాలిని తలనొప్పిగా ఉందని చెప్పి ఆఫీసుకు వెళ్లకుండా ఉండిపోతుంది. మరోవైపు కార్తీక్, దీప జ్యోత్స్న నుంచి కాల్ రాకపోవడంతో ఆఫీసుకు వెళ్లి విచారిస్తే ఆమె రాలేదని తెలుస్తుంది.
వెంటనే సూరజ్ ను కార్తీక్ కలిసి జ్యోత్స్న ఎక్కడుందో చెప్పాలని కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. దక్షిణామూర్తి వచ్చి మనవడి కాలర్ పట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్న మూడు రోజులుగా కనిపించడం లేదని, దీనికి సూరజ్, మాలినిలే కారణమై ఉండొచ్చని కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్నను ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తానని హెచ్చరిస్తాడు. మరోవైపు సుమిత్ర కూడా జ్యోత్స్న కోసం బాధపడుతూ పనిపై దృష్టి పెట్టలేకపోవడంతో శివన్నారాయణ ఇంటికి వెళ్లమని చెప్తాడు . ఇంట్లో అందరూ జ్యోత్స్న గురించే మాట్లాడుకుంటుండగా కార్తీక్, దీప ఒంటరిగా రావడంతో ఆందోళన పెరుగుతుంది. కార్తీక్ అసలు విషయం చెప్తాడు. మాలిని ఆఫీసులోనే సూరజ్ కు పీఏగా జ్యోత్స్న పనిచేస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ఈ విషయం ఎందుకు చెప్పలేదని కార్తీక్ పై దశరథ్ మండిపడతాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన సూరజ్ తల్లి మాలినిని నిలదీస్తాడు. జ్యోత్స్నను మొదటి నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నావని, తను ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసినా మాలినే జాయిన్ చేయించిందని ఆరోపిస్తాడు. తన తలపై చేయి పెట్టి ఒట్టు వేసి నిజం చెప్పాలని ఒత్తిడి చేయగా మాలిని షాక్ అవుతుంది, ఒట్టు వేయనని అంటుంది.
చివర్లో దక్షిణామూర్తి ఇంటికి శివన్నరాయణ వెళ్లి బయటకు రావాలని సవాల్ చేస్తాడు. దశరథ్ కూడా తన కూతురు ఎక్కడని మాలినిని ప్రశ్నిస్తాడు. మాలిని వెటకారంగా ఈ విషయం ఈరోజే తెలిసిందా అని అంటుంది. తనపై అందరూ అనుమానం వ్యక్తం చేయడంతో బతికి ఉండడం అనవసరమన్నట్లుగా భావోద్వేగానికి గురవుతుంది. మాలిని నిజం చెబుతోందా, నటిస్తోందా, జ్యోత్స్న అసలు ఎక్కడ ఉందనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

